ఐటీ కంపెనీల ప్రారంభోత్సవం కోసం ఓరుగల్లుకు విచ్చేసిన మంత్రి కేటీఆర్... నగరంలో కారునడిపి... అందరినీ ఆశ్చర్యపరిచారు. నిట్ ప్రాంగణంలో హెలికాఫ్టర్ దిగిన కేటీఆర్కు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతీ రాథోడ్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సాదర స్వాగతం పలికారు.
నిట్ టు మడికొండ పార్కు... కేటీఆర్ సెల్ఫ్ డ్రైవింగ్ - వరంగల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
వరంగల్లో ఐటీ కంపెనీల ప్రారంభోత్సవం కోసం వచ్చిన మంత్రి కేటీఆర్... నగరంలో కారు నడిపి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

వరంగల్లో మంత్రి కేటీఆర్ కారు డ్రైవింగ్
వరంగల్లో మంత్రి కేటీఆర్ కారు డ్రైవింగ్
హెలికాఫ్టర్ దిగీ దిగగానే కేటీఆర్ కారు స్టీరింగ్ పట్టుకుని.. మడికొండలోని ఐటీ పార్కుకు స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. అక్కడి ఐటీ ఉద్యోగులతో ఎంతో ఉత్సాహంగా గడిపారు. ప్రాంగణ పరిసరాల్లో మొక్కలు నాటారు. వారితో కలిసి ఫోటోలు దిగగా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.