తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రాడ్యుయేట్​కు మంత్రి కేటీఆర్ ఫోన్ - గ్రాడ్యుయేట్​కు ఫోన్ చేసిన కేటీఆర్

ఓ గ్రాడ్యుయేట్​కు మంత్రి కేటీఆర్ ఫోన్​ చేసి సంభాషించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్ గ్రామానికి చెందిన భాస్కర్​తో ఆయన ఫోన్​లో మాట్లాడారు.

గ్రాడ్యుయేట్​కు మంత్రి కేటీఆర్ ఫోన్
గ్రాడ్యుయేట్​కు మంత్రి కేటీఆర్ ఫోన్

By

Published : Sep 24, 2020, 11:09 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్ గ్రామానికి చెందిన గ్రాడ్యుయేట్ భాస్కర్​కు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్​ చేసి సంభాషించారు. గ్రామంలో ఎంతమంది గ్రాడ్యుయేట్​లు ఉన్నారని ఆరా తీసిన మంత్రి... తెరాస విజయానికి కృషి చేయాలని కోరారు. మంత్రి ఫోన్ చేయడం పట్ల గ్రాడ్యుయేట్ భాస్కర్ సంతోషం వ్యక్తం చేశారు.

వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రుల ఓటు నమోదుపై పున్నెల్ గ్రామానికి చెందిన గ్రాడ్యుయేట్​తో మంత్రి ఫోన్​లో సంభాషించారు. కార్యకర్తల కృషితోనే తెరాస ఈ స్థాయికి ఎదిగిందని మంత్రి అన్నారు. ఉత్సాహంగా పట్టభద్రుల ఓటు నమోదు చేపట్టాలని కోరారు.

ఇదీ చూడండి: తెరాస శ్రేణులతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్

ABOUT THE AUTHOR

...view details