పట్టణ ప్రగతిలో నిర్దేశించిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి అక్టోబర్ 2లోగా పూర్తి చేయాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఆదేశించారు. పురపాలక ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్తో కలసి మంత్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం, స్వచ్ఛ సర్వేక్షన్ 2021, వన్ టైం సెటిల్మెంట్ మొదలగు అంశాలపై అదనపు ఉమ్మడి వరంగల్ కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి పూర్తి చేసేలా పకడ్బందిగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో నాలాలపై ఆక్రమణల తొలగింపు పురోగతిని అడిగి తెలుసుకున్నారు.