తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస' ఓపిక నశిస్తే.. 'భాజపా' బయట తిరగలేదు: కేటీఆర్‌ - ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడి వార్తలు

ktr
ktr

By

Published : Jan 31, 2021, 7:50 PM IST

Updated : Jan 31, 2021, 8:07 PM IST

19:49 January 31

ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన మంత్రి కేటీఆర్‌

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు. తమ వాదనతో ఒప్పించడం చేతకాక, దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. భాజపా తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సూచించారు.  

"గతంలోనూ భాజపా భౌతిక దాడులకు ప్రయత్నించింది. తెరాస కార్యకర్తలను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయి. తెరాస కార్యకర్తల ఓపిక నశిస్తే.. భాజపా కనీసం బయట తిరగలేదు. ప్రశాంతమైన తెలంగాణలో చిచ్చుపెట్టాలని భాజపా చూస్తోంది. భాజపా కుటిలప్రయత్నాలను ప్రజలు గమనించాలి. భాజపా నేతలను నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నా."

- కేటీఆర్​

ఇదీ చదవండి :ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి

శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయాలు: చల్లా ధర్మారెడ్డి

Last Updated : Jan 31, 2021, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details