రైతు వేదికలు చైతన్య వేదికలుగా మారాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో ఏర్పాటైన రైతు వేదికను.. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీతో కలిసి ఆయన ప్రారంభించారు. దేశంలో 70శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడ్డారని మంత్రి పేర్కొన్నారు. ఆ రంగం బాగుంటేనే దేశంమంతా బాగుంటుందన్నారు.
పండించిన పంటకు ధర నిర్ణయించుకోవాలంటే రైతులు సంఘటితం కావాలని మంత్రి పేర్కొన్నారు. తక్కువ పెట్టబడితో పంటలను సాగు చేసుకోవాలన్నారు. రైతులంతా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.