వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు.
'పేదలకు అండ... కేసీఆర్ సర్కార్' - మంత్రి ఈటల రాజేందర్
పేదలను ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
వరంగల్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నఈటల రాజేందర్
ప్రభుత్వం తరఫున మంత్రి... పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగను అందరు జరుపుకునేలా కేసీఆర్ ప్రభుత్వం రెండ్రోజులపాటు సెలవులు ప్రకటించిందని తెలిపారు. అన్నివర్గాల వారికి సీఎం కేసీఆర్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : అంబులెన్స్‌లోనే పాపకు జన్మనిచ్చిన తల్లి