వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కుమార్పల్లిలో కీచకుడి కిరాతకానికి బలైన తొమ్మిది నెలల చిన్నారి కుటుంబాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. మంత్రిని చూసిన పాప తల్లిదండ్రులు బోరున విలపించారు. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కన్నీళ్ల పర్యంతమవుతున్న వారిని మంత్రి ఓదార్చారు. ఘటన తీరుపై ఆరా తీశారు. అతి కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చిన కిరాతకుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఈ సంఘటన ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందని చెప్పుకొచ్చారు.
'చిన్నారి కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ' - 9 MONTHS OLD NEONATAL KID
వరంగల్ అర్బన్ జిల్లాలో కామాంధుడి కిరాతకానికి ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది నెలల పసికందు కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.
ఘటన గురించి ఆరాతీస్తున్న మంత్రి