తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బాధితులకు ఫోన్లో ధైర్యం చెప్పిన మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి

పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఫోన్​లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కరోనా వచ్చినంత మాత్రాన ప్రాణాలు పోతాయని భయపడాల్సిన అవసరం లేదని.. సరైన జాగ్రత్తలు పాటిస్తే.. పది రోజుల్లో కరోనాను గెలవచ్చని ఆయన అన్నారు. 189 మంది కరోనా బాధితులతో మాట్లాడిన ఆయన.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

minister errabelli tele conference with corona patients
కరోనా బాధితులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : Aug 23, 2020, 10:50 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి పట్టణం, కొడకండ్ల, దేవరుప్పల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లో కరోనాతో బాధపడుతున్న బాధితులు, వారి కుటుంబ సభ్యులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఫోన్​లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దాదాపు 189 మందితో కరోనా బాధితులతో మాట్లాడిన ఆయన బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆరోగ్యం ఎలా ఉంది.. వైద్యం ఎలా అందుతోందంటూ ఆరా తీశారు. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవాలని సూచించారు. కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని.. అధైర్య పడొద్దని, ఆధునిక వైద్యంతో చాలామంది ప్రాణాలు కాపాడుకుంటున్నారని, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అద్భుతమైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు.

స్వీయ నియంత్రణ‌, సామాజిక దూరం, మాస్కులు ధ‌రించడం, వ్యక్తిగత, పరిసరాల శుభ్రత వంటి జాగ్రత్తలు పాటిస్తే.. కరోనా రాకుండా ఉండొచ్చన్నారు. ఒకవేళ పాజిటివ్​ వచ్చినా హోం క్వారంటైన్​లో మూడు వారాలు ఉండి.. సరైన జాగ్రత్తలు, వైద్యుల సలహాలు పాటిస్తే చాలని సూచించారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత కూడా ఉచితంగా పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకుంటానని బాధితులకు హామీ ఇచ్చారు. కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎంజిఎం సహా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలతో పాటు తగు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, బాధితులంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి:గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!

ABOUT THE AUTHOR

...view details