భాజపా, ఎంఐఎంలు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధిపొందాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా మెజారిటీ ప్రజలు తెరాస వైపే ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఐఎం పొత్తు లేకుండానే గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ఆయన అన్నారు.
'ఎంఐఎంతో పొత్తు లేకుండానే మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం' - వాహనాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
ఎంఐఎంతో పొత్తు లేకుండానే గ్రేటర్లో మేయర్ పీఠం దక్కించుకుంటామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. మత ఘర్షణలు రెచ్చగొట్టి భాజపా, ఎంఐఎంలు ఎన్నికల్లో లబ్ధిపొందాయని ఆయన ఆరోపించారు. వరంగల్ మహానగరపాలక సంస్థ కొనుగోలు చేసిన ట్రాక్టర్లను, కంప్రెషర్లను ఆయన ప్రారంభించారు.
పొత్తు లేకుండానే మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం: ఎర్రబెల్లి
వరంగల్ మహానగర పాలకసంస్థ రూ.30 కోట్లతో కొనుగోలు చేసినా ట్రాక్టర్లను,కంప్రెషర్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, పురపాలక కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.