తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదల సంక్షేమమే తెరాస లక్ష్యం: ఎర్రబెల్లి - Parakala MLA Challa Dharma Reddy

పేదల సంక్షేమమే తెరాస లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. మీ ఇంటి ఆడ బిడ్డను దీవించాలని కోరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా... 16వ డివిజన్ ధర్మారంలో మంత్రి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రచారం నిర్వహించారు.

minister errabelli, trs goal is the welfare of the poor people
పేదల సంక్షేమమే తెరాస లక్ష్యం: ఎర్రబెల్లి

By

Published : Apr 24, 2021, 8:29 PM IST

గ్రేటర్ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నారు. 16వ డివిజన్ ధర్మారంలో నిర్వహించిన ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించామని మంత్రి తెలిపారు. తెలంగాణలో ప్రతి ఆడ బిడ్డకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

గ్రేటర్ వరంగల్ విలీన గ్రామాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మన నియోజకవర్గంలో టెక్స్​టైల్ పార్కు ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధిక నిధులు తీసుకువచ్చి డివిజన్ అభివృద్ధి చేసిన నాయకుడు సుంకరి శివ కుమార్ అని కొనియాడారు. 66 డివిజన్​లో కారు గుర్తుకు ఓటు వేసి సుంకరి మనీషా శివ కుమార్​ను గెలిపించాలని అభ్యర్థించారు.

ఇదీ చూడండి :అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details