తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎర్రబెల్లి - Errabelli meeting with trs Corporators

వరంగల్​ నగర నూతన కార్పొరేటర్లతో మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగుల సమావేశం అయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పేర్లు వెల్లడిస్తామని ఎర్రబెల్లి ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు. కొంతమంది పేర్లు రాకపోవచ్చని ఆయన సూచించారు.

minister errabelli, warangal mayors meeting
పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎర్రబెల్లి

By

Published : May 7, 2021, 11:55 AM IST

Updated : May 7, 2021, 12:20 PM IST

పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎర్రబెల్లి

గ్రేటర్ వరంగల్ తెరాస కొత్త కార్పొరేటర్లతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం పార్టీ పరిశీలకులుగా వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్లు సమావేశమయ్యారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డి విప్ జారీ చేసి... ఎన్నికకు సంబంధించి నిబంధనలను తెలియజేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. నిర్ణయాన్ని వ్యతిరేకించే వారెవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పార్టీని నమ్ముకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందని... అందుకు తానే ఉదాహరణ అని పార్టీ పరిశీలకులుగా వచ్చిన గుంగుల కమలాకర్ అన్నారు. అందరికీ అర్హతలున్నా... ఒక్కరే మేయర్, డిప్యూటీ మేయర్ అవుతారని... పార్టీ నిర్ణయమే అందరికీ శిరోధార్యమని తెలిపారు. సీల్డ్ కవర్​లో వచ్చే పేరేదైనా....కార్పొరేటర్లు ఏకగ్రీవంగా మద్దతివ్వాలని పార్టీ మరో పరిశీలకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 14 నెలలుగా సెలవు లేకుండా వైరస్‌తో సహవాసం

Last Updated : May 7, 2021, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details