తెలంగాణ

telangana

ETV Bharat / state

అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి - Panchayat raj minister Errabelli Dayakar Rao

పంచాయతీరాజ్​ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పంచాయతీలకు ప్రధాని పురస్కారాలు అందించారు. ఈ తరుణంలో రాష్ట్ర స్థానిక సంస్థలకు 12 జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలు, పంచాయతీలకు మోదీ పురస్కారాలు ప్రకటించారు. నిధుల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అభివృద్ధిని గుర్తించి అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలని కోరారు.

minister errabelli, 13 panchayat awards for Telangana
అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి

By

Published : Apr 24, 2021, 3:11 PM IST

కేంద్రం పురస్కారాలిస్తుంది కానీ... నిధుల్లో కోత పెడుతోందని... పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ప్రతిభ చాటినందుకు, పనులు బాగా చేసినందుకు పూర్తి నిధులివ్వాలని... అదనంగా ఇస్తే ఇంకా సంతోషమని తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా... రాష్ట్రీయ పంచాయతీ పురస్కారాలను వర్చువల్‌గా ప్రధాని చేతుల మీదుగా మంత్రి అందుకున్నారు.

గ్రామాలు దేశ వికాసానికి పట్టుగొమ్మలని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. గ్రామాలకు కరోనా పాకకుండా కట్టడి చేయాలని... కరోనా విముక్తి గ్రామాలుగా మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. గంగదేవిపల్లి మించి రాష్ట్రంలో అనేక గ్రామ పంచాయితీలు అభివృద్ధిలో ముందుంటున్నాయని ఎర్రబెల్లి దయకరరావు తెలిపారు. ఈ దఫా 13 అవార్డులు వచ్చాయని... ఇందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి

ఇదీ చూడండి :రాష్ట్ర మంత్రులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు: కిషన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details