కాలువల పనులు సహా దేవాదుల ప్రాజెక్టులో మిగిలిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి సమీక్షించారు.
'దేవాదుల ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి' - minister errabelli review meeting news
దేవాదుల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సంబంధిత ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడొద్దని సూచించారు.
'దేవాదుల ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి'
మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని మంత్రి సూచించారు. భూసేకరణ జరగని ప్రదేశాల్లో తక్షణమే భూసేకరణ పనులు పూర్తి చేయాలని, సమస్యలుంటే సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. మిగిలిన పనులకు వెంటనే టెండర్లను ఖరారు చేయాలని.. ఆయా పనులు నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై ఈనెల 19న మరోమారు సమీక్ష నిర్వహిస్తానని, అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు.