తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం' - మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం వార్తలు

వరంగల్​ నగరంలోని నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. వర్షాల కారణంగా తలెత్తిన సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

minister errabelli review meeting with officials
'నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం'

By

Published : Aug 17, 2020, 8:58 PM IST

మంత్రి ఈటలతో కలిసి కేటీఆర్ రేపు వరంగల్​ రానున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు.​ వరద నష్టంపై పరిశీలన జరపనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల కారణంగా ప్రజల ఇబ్బందులు, దెబ్బతిన్న రహదారులు, పంట నష్టం తదితర అంశాలపై ఆర్అండ్​బీ అతిథి గృహంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్​భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్​రావు సమావేశంలో పాల్గొన్నారు.

వరదల కారణంగా నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. నగరవాసులకు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

'నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం'

ఇదీచూడండి: సెప్టెంబరు 7 నుంచి శాసనసభ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details