వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మయూరి గార్డెన్స్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆత్మీయ అతిథిగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌లు హాజరయ్యారు.
ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది వల్లే తెలంగాణకు ఉత్తమ రాష్ట్రంగా అవార్డులు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించడం లేదని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇప్పుడు హామీలు ఇవ్వడం సాధ్యం కాదని.. పదోన్నతులు, జీతాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి డిమాండ్ల పరిష్కారం కోసం సంఘాల నాయకులతో ఎన్నికల తర్వాత మాట్లాడతామని స్పష్టం చేశారు.