వరంగల్ నగరాన్ని చరిత్రలో నిలిచే స్థాయిలో అభివృద్ధి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో మేయర్ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన నిర్వహించిన జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వరంగల్‌ను చరిత్రలో నిలిచేలా అభివృద్ధి చేస్తాం: ఎర్రబెల్లి - వరంగల్ అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు
వరంగల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. నగర అభివృద్ధికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో మేయర్ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన నిర్వహించిన జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వరంగల్‌ను చరిత్రలో నిలిచేలా అభివృద్ధి చేస్తాం: ఎర్రబెల్లి
వరంగల్ అభివృద్ధికి వస్తున్న అడ్డంకులను తొలగిస్తూ.. కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. నగరంలోని నాలాల గురించి మంత్రి కేటీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు అద్భుతంగా పని చేశాయని కొనియాడారు. ఎంజీఎంకు మరిన్ని నిధులు కేటాయించి.. ప్రజలను కాపాడుకుందామన్నారని గుర్తు చేశారు.