పత్తి, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులు పడే పరిస్థి రాకుండా చూసుకోవాలని అధికారులను సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పంటల కొనుగోళ్లపై వరంగల్ అంబేడ్కర్ భవన్లో జరిగిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి అధిక దిగుబడి వచ్చే అవకాశమున్నందున కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందుకు తలెత్తకూడదన్నారు. దిగుబడికి అనుగుణంగా జిల్లావ్యాప్తంగా కేంద్రాలను పెంచాలని... సీసీఐ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
'కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రాకూడదు' - వరంగల్ అంబేడ్కర్ భవన్లో మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ అంబేడ్కర్ భవన్లో పంటల కొనుగోళ్లపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై పత్తి, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వరంగల్ అంబేడ్కర్ భవన్లో మంత్రి ఎర్రబెల్లి