తెలంగాణ

telangana

ETV Bharat / state

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ జిల్లా హన్మకొండలో బాలికపై ఆత్యాచారం చేసి ఆమె చావుకు కారుకులైన నిందితులను కఠినంగా శిక్షిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకర్‌ రావు స్పష్టం చేశారు. నగరంలో మహిళల రక్షణకు షీ టీంలను బలోపేతం చేస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : Aug 12, 2019, 6:54 PM IST

హన్మకొండలోని సమ్మయ్యనగర్‌లో 9వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికపై ముగ్గురు నిందితులు ఆత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో బాధితురాలు అవమానం భరించలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌తో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నారని వెల్లడించారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా నిందితులకు శిక్ష పడే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details