వరంగల్ మహా నగరంలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సంబంధిత శాఖల అధికారులతో కలసి హన్మకొండ, వరంగల్‌లో పలు స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
'అనువైన స్థలాలను వెంటనే గుర్తించండి'
మోడల్ మార్కెట్ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని మంత్రి ఎర్రబెల్లి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో కలిసి పలు స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చర్యలు
మోడల్ మార్కెట్ ఏర్పాటుకు అనువైన స్థలాలను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ లక్మీపురంలో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. డీపీఆర్ త్వరగా చేసి పనులు ప్రారంభించాలన్నారు. దీనికి అదనంగా మరో 4 సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు కాజీపేట్ పాత మార్కెట్, చింతగట్టు కెనాల్ వద్ద స్థలాలు పరిశీలనలో ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి:మన్‌సుఖ్ హిరేన్ మృతి కేసులో కీలక మలుపు