కరోనా వైరస్ మరణాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao) అన్నారు. వ్యాక్సినేషన్‌పై కేంద్రం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. వ్యాక్సిన్ పంపిణీలో రాష్ట్రాలకు అధికారం లేకుండా చేశారని ఎర్రబెల్లి విమర్శించారు. లక్షల రూపాయల మేర బాధితులకు వైద్యం కోసం ఖర్చైందని.... ఎవరు ఇస్తారని మంత్రి ప్రశ్నించారు.
Errabelli : 'కొవిడ్ మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలి'
తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా సర్కార్ దవాఖానాలు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) తెలిపారు. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తుంటే.. భాజపా నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి, ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్‌లో నిరుపేదలకు వైద్యసేవలందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తుంటే.. భాజపా నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 21న జిల్లాకు వచ్చే ముఖ్యమంత్రి....ఆసుపత్రికి భూమిపూజ చేస్తారని... కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన భవనం, వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారని మంత్రి ఎర్రబెల్లి(Errabelli Dayakar Rao) తెలిపారు.
- ఇదీ చదవండి :ప్రేమలేనిదే జీవించలేమని.. ప్రేమికుల ఆత్మహత్య
Last Updated : Jun 19, 2021, 3:02 PM IST