ప్రతిపక్షాల తీరుపై పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్, భాజపాలు రాష్ట్రంలో మూర్ఖంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ మహేందర్ రెడ్డితో కలసి వరంగల్ అర్బన్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ప్రతిపక్షాలకు తెరాసను విమర్శించే నైతికత లేదు: మంత్రి ఎర్రబెల్లి - minister errabelli fire on leftinent parties
వరంగల్ అర్బన్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రారంభించారు. అనంతరం ప్రతిపక్షాలు తెరాస సర్కారుపై చేస్తున్న విమర్శలను ఖండిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తప్ప భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ధాన్యం కొనుగుళ్లు జరగడం లేదని అన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్న మంత్రి... ప్రతిపక్షాలకు తెరాసను విమర్శించే నైతికత లేదని ఎద్దేవా చేశారు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు బహుమతులు ఉంటాయని.. ఎలాంటి విమర్శలకు తావులేకుండా కొనుగోళ్లు సాగేలా స్థానిక ప్రజాప్రతినిధులు జాగ్రత్తపడాలని సూచించారు.
ఇదీ చూడండి:రైతులకు నష్టం కలిగితే సహించేది లేదు: మంత్రి పువ్వాడ