తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరంగల్​ నగరానికి నూతన వైభవం తీసుకొస్తాం' - వరంగల్​లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట్​లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఫాతిమా కూడలిలో ఏర్పాటు చేసిన వావ్​ వరంగల్​ వాటర్​ ఫౌంటెన్​ని మంత్రి ప్రారంభించారు. రానున్న రోజుల్లో వరంగల్​ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు.

minister errabelli dhayaker rao participated in state formation day in kazipet
'వరంగల్​ నగరానికి నూతన వైభవం తీసుకొస్తాం'

By

Published : Jun 2, 2020, 3:13 PM IST

వరంగల్ నగరానికి నూతన వైభవాన్ని తీసుకురావడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ ఫాతిమా కూడలిలో వావ్ వరంగల్ వాటర్ ఫౌంటెన్​ని మంత్రి ప్రారంభించారు.

వరంగల్ నగరానికి ఘనమైన చరిత్ర ఉందని.. దాన్ని ప్రతిబింబించేలా త్రినగరికి ప్రారంభంలో ఈ చిహ్నాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. వరంగల్ భద్రకాళి బండ్ సుందరీకరణ, కాజీపేట రైల్వేట్రాక్​పై పాత వంతెనకు సమాంతరంగా మరో వంతెన నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు. రానున్న రోజులలో మరిన్ని నిధులను విడుదల చేసి నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details