వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని ఎర్రబెల్లిలో ఏర్పాటుచేసిన డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు. మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రులు కొనియాడారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన గురుకులల ద్వారా మెరుగైన విద్యను అందించడానికి కృషి చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మంత్రులు అభినందించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని సూచించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని మంత్రులు వివరించారు.
'అంబేడ్కర్ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి' - MINISTER ERRABELLI DHAYAKER, KOPPULA EESHWAR INAUGURATED AMBEDKER STATUE
అంబేడ్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్ సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఎర్రబెల్లిలో నూతనంగా నిర్మించిన అబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
MINISTER ERRABELLI DHAYAKER, KOPPULA EESHWAR INAUGURATED AMBEDKER STATUE