వరంగల్‌కు హైదరాబాద్ కంటే ఎక్కువ వనరులున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకుని మరింత అభివద్ధికి కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలో 15 మంది అడ్వైజరీ సభ్యులు... మంత్రి ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. కుడా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసికట్టుగా వరంగల్‌ను అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నగరంలో నీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నారని మంత్రి తెలిపారు.
'కుడా అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేద్దాం' - MINISTER ERRABELLI DAYAKER RAO VISITS WARANGAL
వరంగల్ అర్బన్ జిల్లా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలో 15 మంది అడ్వైజరీ సభ్యులు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. అందరం కలిసి కట్టుగా కుడా అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు.
!['కుడా అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేద్దాం' MINISTER ERRABELLI DAYAKER RAO VISITS WARANGAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5383114-thumbnail-3x2-llll.jpg)
MINISTER ERRABELLI DAYAKER RAO VISITS WARANGAL
'కుడా అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేద్దాం'
ఈ కథనం చదవండి: మార్పెక్కడ: 17 రోజుల్లో 13 అఘాయిత్యాలు!