Minister Errabelli Dayaker Rao: రాజకీయంలోకి దిగాక సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ నేతలు బిజీబిజీగా గడుపుతారు. అందులోనూ ప్రజాప్రతినిధిగా.. అదీ ఓ మంత్రి హోదాలో ఉంటే ఇక అంతే సంగతులు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, అధికారులతో సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు.. ఇలా సవాలక్ష పనులతో.. బిజీలైఫ్ గడుపుతుంటారు. దైనందిన కార్యక్రమాల్లో పడి.. నేతలు తమ వ్యక్తిగత జీవితానికి, అభిరుచులకు కాస్త దూరం అవుతారు. అలాంటి బిజీ షెడ్యూల్లోనూ.. అప్పుడప్పుడు అన్ని మర్చిపోయి సాధారణ వ్యక్తుల్లా తమ అభిరుచులను ఆస్వాదిస్తూ.. ఆనందిస్తుంటారు. అచ్చం అలాంటి క్షణాలనే.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆస్వాదించారు. తనకెంతో ఇష్టమైన ఐస్‌క్రీం తింటూ చిన్నపిల్లాడిలా మురిసిపోయారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండపంలో పర్యటిస్తున్న క్రమంలో ఊకల్ గ్రామంలో నిర్వహించే కాటమయ్య పండగకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెళ్తున్నారు. ఈ వెళ్లే క్రమంలో ఒక దగ్గర.. ఓ ఐస్‌క్రీమ్ బండి మంత్రి కంటపడింది. వేగంగా వెళ్తున్న కాన్వాయ్ కంటే వంద రెట్ల వేగంతో మంత్రి తన బాల్యానికి వెళ్లిపోయారు. ఐస్‌క్రీం బండి కనిపించగానే.. పిల్లలంతా పరుగెత్తుకుంటూ వెళ్లి తలా ఒకటి కొనుక్కొని తింటూ కేరింతలు కొట్టే.. తన చిన్ననాటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. ఇంకేముంది ఆ రోజులుకు గుర్తురాగానే మంత్రికి నోట్లో నీళ్లూరాయి. వెంటనే కాన్వాయ్‌ని ఐస్‌క్రీమ్ బండి దగ్గరు వెళ్లాలని ఆదేశించారు.