గ్రామీణ ప్రాంతాల్లో లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలవుతున్నప్పటికీ పట్టణాల్లో అంతంత మాత్రంగానే ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ పట్టణంలో ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
పట్టణాల్లో లాక్డౌన్ అంతంతమాత్రమే: ఎర్రబెల్లి - corona news in warangal
వరంగల్ పట్టణంలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు కావడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంతలా చెబుతున్నా ప్రజల్లో మార్పురావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పట్టణాల్లో లాక్డౌన్ అంతంతమాత్రమే: ఎర్రబెల్లి
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రజల సహకారంతోనే కరోనాను తరిమికొట్టగలమని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:మహమ్మారికి మాస్కులు.. తయారీకి మహిళా సంఘాలు