త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అన్నిరకాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. వరంగల్ ఎంజీఎంను పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన ఆసుపత్రిలో రేపటి నుంచి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు.
రేపటి నుంచి ఎంజీఎంలో కొవిడ్ సేవలు: ఎర్రబెల్లి - వరంగల్ జిల్లావార్తలు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని పూర్తిస్థాయి కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన ఆస్పత్రిలో రేపటి నుంచి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అన్నిరకాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన ఆస్పత్రిలో ఎర్రబెల్లి
పోస్టుల భర్తీ..
ఖాళీగా ఉన్న 281 పోస్టులు భర్తీ చేస్తున్నామని .. 250 పడకలను సిద్ధం చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. నూతన ఆస్పత్రిలోని పలువిభాగాలను సందర్శించిన ఎర్రబెల్లి.. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని వివరించారు. ఎంజీఎంలో కొవిడ్ బాధితుల కోసం 12 వందల 50 పడకలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొదించాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు..
ఇదీ చూడండి:ప్రజల్లో కరోనా భయం.. మందులకై ముందు జాగ్రత్త!!
Last Updated : Apr 29, 2021, 2:54 PM IST