వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొవాగ్జిన్ తొలి డోసు తీసుకున్నారు. మంత్రి కుటుంబ సభ్యులు, వరంగల్ మేయర్, పలువురు కార్పొరేటర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలోనే టీకా తీసుకోవాలి: ఎర్రబెల్లి - తెలంగాణ వార్తలు
వరంగల్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఎలాంటి అపోహలు లేకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలోనే టీకా తీసుకోవాలి: ఎర్రబెల్లి
కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి తెలిపారు. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని... అందుబాటులో ఉన్న కేంద్రాల్లో వేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే టీకా తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
ఇదీ చదవండి:కరోనా తొలి కేసుకు ఏడాది.. 'గాంధీ'పై ఈటల ప్రశంసల జల్లు