Errabelli Dayakar rao Review: మిర్చి రైతులకు నష్టం జరగకుండా వరంగల్ ఎనుమాముల మార్కెట్ అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. ఉదయం నుంచి మార్కెట్‌లో జరిగిన రైతుల ఆందోళనపై ఆయన సమీక్షించారు. జిల్లా కలెక్టర్, మార్కెట్ ఛైర్మన్‌తో మాట్లాడారు. రైతులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని.. ఎవరు మోసం చేసినా క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
గత సంవత్సరం కన్నా... ఈసారి మిర్చి పంటలకు ధరలు బాగా ఉన్నాయని... అయితే చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడులు తగ్గాయని మంత్రి అన్నారు. రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా మార్కెట్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గిట్టుబాటు ధరలు వచ్చిన రైతులు తమ సరుకులను విక్రయించుకోవాలని సూచించారు. మిగిలిన రైతులు... శీతల గిడ్డంగుల్లో భద్రపరుచుకోవాలన్నారు. కలెక్టర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్, కమిటీ సభ్యులు, మార్కెటింగ్ శాఖ అధికారులు... రోజూ ధరలపై పర్యవేక్షించాలని, రైతులకు అధిక ధరలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భగ్గుమన్న రైతులు..