నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంపై.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం(Minister errabelli on new farm laws) వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం నూతన సాగు చట్టాలను తీసుకువచ్చిందని ఎర్రబెల్లి ఆరోపించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేసిన రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని గుర్తుచేశారు. హనుమకొండలో మంత్రి దయాకర్ రావు.. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు మంత్రి సంతాపం, సానుభూతి తెలియజేశారు.
అండగా నిలిచారు
రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ, రైతులకు అండగా కేసీఆర్ నిలిచారని ఎర్రబెల్లి(Minister errabelli on new farm laws) అన్నారు. సాగు చట్టాలను సీఎం.. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆదేశాలతో పార్లమెంటులో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తెరాస ఎంపీలు బాయ్‌కాట్ చేశారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా రైతులను ఏకం చేసేందుకు శ్రీకారం చుట్టి.. ధర్నాలు చేపట్టడంతోనే మోదీ ప్రభుత్వం దిగివచ్చిందని స్పష్టం చేశారు.
'కేసీఆర్ బహుభాషా కోవిదుడు. ధాన్యం కొనుగోళ్లు, సాగు చట్టాల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు పోరాడేలా చేయాలని చూశారు. రైతుల పోరాటాలు, సీఎం కేసీఆర్ ధర్నాతో కేంద్రం దిగొచ్చింది. ఆరంభం నుంచి కేసీఆర్ సాగుచట్టాలను వ్యతిరేకించారు. రైతులకు అండగా నిలిచారు. రైతుల పోరాట స్ఫూర్తితో కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తాం. ఇకనైనా రాష్ట్ర భాజపా నాయకులు, విపక్షాలు తీరు మార్చుకోవాలి.'-ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
కేసీఆర్ అంగీకరించలేదు