తెలంగాణ

telangana

By

Published : Jan 26, 2021, 8:00 PM IST

Updated : Jan 26, 2021, 8:07 PM IST

ETV Bharat / state

'సురక్షితానికి మారుపేరు మిషన్ భగీరథ వాటర్​ బాటిల్స్'

మిషన్​ భగీరథ నీరు స్వచ్ఛమైనదని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. వరంగల్​లోని తన క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ వాటర్​ బాటిల్​ను ఆయన ఆవిష్కరించారు.

మిషన్​ భగీరథ వాటర్​ బాటిల్​ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
మిషన్​ భగీరథ వాటర్​ బాటిల్​ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్​ భగీరథ పథకం తీసుకొచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. మిషన్ భగీరథ జలం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం సురక్షితమైనదిగా గుర్తింపు పొందినదని మంత్రి పేర్కొన్నారు. వరంగల్​లోని తన క్యాంపు కార్యాలయంలో భగీరథ వాటర్​ బాటిల్​ను ఆయన ప్రారంభించారు.

భగీరథ జలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నట్లు తెలిపారు. ముందుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నీటిని సరఫరా చేస్తునట్లు వివరించారు. ప్రజలందరూ పరిశుభ్రమైన మిషన్ భగీరథ నీటిని వినియోగించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:ఈ చిన్నారుల గణతంత్ర వేడుకలు.. ఎందరికో ఆదర్శం

Last Updated : Jan 26, 2021, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details