కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు టీకా తీసుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ఆయన... వైద్యాధికారులతో చర్చించారు. జిల్లాలో 31,299మందికి టీకా ఇవ్వాలని ప్రణాళిక తయారు చేశామని చెప్పారు.
వ్యాక్సిన్‌పై వచ్చే వదంతులు నమ్మొద్దు: మంత్రి ఎర్రబెల్లి - తెలంగాణ వార్తలు
కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారు... రెండో డోసు వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ఆయన ప్రారంభించారు. టీకాపై వచ్చే వదంతులను నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
వ్యాక్సిన్‌పై వచ్చే వదంతులు నమ్మొద్దు: మంత్రి ఎర్రబెల్లి
టీకా తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణ కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 18 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాక్సిన్‌పై వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ప్రపంచంలో 'మేడ్ ఇన్ తెలంగాణ' మార్మోగుతోంది: మంత్రి