వరంగల్ నగరంలో నీటమునిగిన కాలనీలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. హంటర్ రోడ్డులోని సంతోషిమాత నగర్‌తో పాటు సమ్మయ్య నగర్, మైసయ్య నగర్, పెద్దమ్మగడ్డ ప్రాంతాలను సందర్శించారు.
ఓరుగల్లులో నీటమునిగిన కాలనీలను పరిశీలించిన మంత్రి - warangal district news
వరంగల్ నగరంలో నీటమునిగిన కాలనీలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. ప్రత్యేక బోటులో కాలనీకి చేరుకొని మంత్రి కాలనీ వాసులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
![ఓరుగల్లులో నీటమునిగిన కాలనీలను పరిశీలించిన మంత్రి Minister inspecting submerged colonies in warangal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8494873-193-8494873-1597931351033.jpg)
ఓరుగల్లులో నీటమునిగిన కాలనీలను పరిశీలించిన మంత్రి
ప్రత్యేక బోటులో కాలనీకి చేరుకొని కాలనీవాసులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గల కారణాలను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కాలనీ వాసులకు మనోధైర్యాన్ని కల్పించారు. ముంపు ప్రాంతాలలో నష్టపోయిన వారికి నిత్యావసర సరుకుల అందజేస్తామని హామీ ఇచ్చారు.