వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్న పీవీ విగ్రహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కీర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీవీని గుర్తించలేదని... ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో శతజయంతి వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఆయన పుట్టిన ఊరు, పెరిగిన ఊరును అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తాను పీవీ శిష్యుడినని పేర్కొన్నారు.