వరి ధాన్యం కొనుగోలుపై భాజపా, కాంగ్రెస్ నాయకులు స్పష్టత లేకుండా నాటకాలు ఆడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister errabelli dayakar rao on paddy) విమర్శించారు. ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు ఆపి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డిలతో కలిసి మంత్రి హన్మకొండలోని తన నివాసంలో మాట్లాడారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంటున్నాయా అని మంత్రి ప్రశ్నించారు. రైతుల ధాన్యాన్ని కేంద్రం(Errabelli on BJP)ఎంత మేరకు కొంటుందో స్పష్టత ఇవ్వాలని నిలదీశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన కేంద్ర మంత్రులు స్పష్టతను ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
ఇక నీ ఫకీర్ వేషాలు మానుకో
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి(errabelli fire on revanth reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకనైనా ఫకీర్ వేషాలు మానుకోవాలని హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రం మీద కాకుండా కేంద్రం మీద పోరాడాలని మంత్రి దయాకర్ రావు(minister errabelli on paddy) సూచించారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రభుత్వం వివక్ష చూపుతోందని చెప్పారు. తెలంగాణలో రైతులు వానాకాలంలో పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని... రైతులు సంయమనం పాటించాలని కోరారు. భవిష్యత్తులో యాసంగిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం ముందే ప్రకటించాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఏ పంట వేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
'రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. కేంద్రానికే మరే స్పష్టత లేదు. మీరు ఎంత ధాన్యం కొంటారో స్పష్టత ఇవ్వమని కోరుతున్నాం. ఇప్పటికీ కూడా కలిసేందుకు అవకాశం ఇస్తలేరు. మా మంత్రులను నాలుగు గంటలు వేచి ఉండేలా చేశారు. యాసంగి పంట వేసుకోవాల్నా వద్దా? స్పష్టత ఇవ్వండి. బండి సంజయ్ గానీ, కిషన్ రెడ్డి గానీ ఎవరూ రైతులు కావు. రైతుల సమస్యలు మీకు తెలియవు. మీకు ఎన్నికలుంటే ఒకటి.. భాజపా ఉన్న చోట ఒకటి మాట్లాడుతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇకపై నీవు పకీర్ మాటలు బంద్ చేయి. ఎఫ్సీఐ కొంటేనే మనం వేరొకరికి అమ్మొచ్చు. నష్టం వచ్చినా కూడా కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడి రైతులు ఇక్కడికొచ్చి అమ్మి పోతున్నరు. అక్కడ ఎలా కొంటున్నారో చూశారా. నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్. రైతులకు ఏదో మంచి చేసినట్లు మాట్లాడుతున్నవ్. రైస్ మిల్లర్లతో ఇబ్బందులు ఉన్నాయి. అందరితో మాట్లాడుతున్నాం. గతంలో వర్షాలు పడినా తడిసినా.. మొలకెత్తినా కొన్నాం. ఇప్పటికి కూడా కొంటాం. కాకపోతే స్పష్టత రానీయండి. యాసంగిపై తేల్చేందుకు మీరు కూడా మద్దతు తెలపండి. రైతులకు డబ్బులిస్తే మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. దిల్లీలో రైతులు పోరాటం చేస్తున్నరు. చట్టాల రద్దు కోసం రైతులు ప్రాణాలు అర్పిస్తే దాన్ని కూడా హేళన చేస్తున్నరు. -ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ఇదీ చూడండి: