భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీకి చెందిన నేతలు... ప్రజల్లో చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై విమర్శలు చేస్తే తామే కాదు.. రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.
కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం: ఎర్రబెల్లి - బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి విమర్శలు
భాజపా నేతలు తెలంగాణ ప్రజల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. స్థాయి మరిచి ఇష్టానుసారం మాట్లాడితే... సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై విమర్శలు చేస్తే రాష్ట్ర ప్రజలు చూస్తు ఊరుకోరని పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం: ఎర్రబెల్లి
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఏంచేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీ రాకుండా ఆపేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్నారు. సాగుచట్టాల రద్దుపై దిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుంటే... వారి సమస్యలు పరిష్కరించకుండా భాజపా నేతలు మీడియా సమావేశాలకే పరిమితమయ్యారని ఆక్షేపించారు. రిజిస్ట్రేషన్లలో సమస్యలున్నా... పదిహేనురోజుల్లో అన్నీ పరిష్కారమవుతాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'ఇక నుంచి అన్ని అధికారిక కార్యక్రమాల్లో మిషన్ భగీరథ నీళ్లే'