తెలంగాణ

telangana

ETV Bharat / state

'వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీరు' - వరంగల్ నగర వార్తలు

ఫిబ్రవరి నెల నుంచి వరంగల్​ పట్టణంలోని ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీటిని అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మరో రెండు మూడు నెలల్లో వరంగల్ రూపురేఖలు మరిపోనున్నాయని తెలిపారు. నగర ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు.

clean water would be provided to every house
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

By

Published : Jan 2, 2021, 10:21 AM IST

ఫిబ్రవరి నెల నుంచి వరంగల్​ పట్టణంలోని ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీటిని అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మరో రెండు మూడు నెలల్లో వరంగల్ రూపురేఖలు మరిపోనున్నాయని అన్నారు.

హన్మకొండలోని దర్గా రోడ్​లో రూ. 6.79 కోట్ల వ్యయంతో 4300 పోల్స్​తో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను మంత్రి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఛీప్ విప్ వినయ భాస్కర్​తో కలిసి ప్రారంభించారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​లో బరువు తగ్గిన సెలబ్రిటీలు!

ABOUT THE AUTHOR

...view details