తెలంగాణ

telangana

ETV Bharat / state

గత ప్రభుత్వం డీసీసీబీ బ్యాంకునే లూటీ చేసింది: ఎర్రబెల్లి - Cooperative Society Meeting

Cooperative Society Meeting: హనుమకొండలోని ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​లో సహకార సంఘ వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​​రావు హజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

గత పాలక వర్గం డీసీసీబీ బ్యాంకును లూటీ చేసింది: ఎర్రబెల్లి దయాకర్​
గత పాలక వర్గం డీసీసీబీ బ్యాంకును లూటీ చేసింది: ఎర్రబెల్లి దయాకర్​

By

Published : Nov 20, 2022, 8:16 PM IST

Cooperative Society Meeting: హనుమకొండలోని ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​లో నిర్వహించిన సహకార సంఘ వారోత్సవాల ముగింపు సందర్భంగా, డీసీసీ బ్యాంకు ఆర్థిక ప్రగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు హజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

డీసీసీబీ బ్యాంకు రైతులకు మెరుగైన సేవలు అందిస్తుందని అభినందించారు. రైతులకు నేరుగా సేవ చేసే అవకాశం సహకార సంఘాలకు ఉంటుందన్నారు. గత పాలక వర్గం డీసీసీబీ బ్యాంకును లూటీ చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం డీసీసీబీ బ్యాంకులను లాభాల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్​ మర్నేని రవీందర్​రావు, బ్యాంకు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details