Errabelli Dayakar Rao: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను వరంగల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తిలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణకు ఆబ్సెంట్ అయిన మహిళలతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆటపట్టించారు.
ఒక్కరోజు రాకపోయినా శిక్షణ కేంద్రం నుంచి తొలగిస్తామని.. మీ ఎమ్మెల్యే చెప్పారని మహిళలతో చరవాణిలో సంభాషించారు. కాసేపు మంత్రి మాటలు విన్న ఆ మహిళ మంత్రి ఎర్రబెల్లిని గుర్తించి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. శిక్షణ కేంద్రంలో నిర్వాహకులు శిక్షణ ఇస్తున్న సరళిని పరిశీలించారు. అనంతరం శిక్షణ శిబిరం గురించి శిక్షణ పొందుతున్న మహిళలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ పూర్తి చేసిన వెంటనే జిల్లాలోని టెక్స్ టైల్ పార్క్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.