తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్థిక సాయం చేసి దాతృత్వం చాటుకున్న ఎర్రబెల్లి - MGM hospital

వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులకు కిట్లు పంపిణీ చేయడానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న తల్లీకూతుళ్లకు సాయం చేశారు.

minister-errabelli-dayakar-financial-aid
ఆర్థిక సాయం చేసి దాతృత్వం చాటుకున్న ఎర్రబెల్లి

By

Published : Apr 21, 2020, 2:33 PM IST

హుజూరాబాద్​ మండలం సిరిసపల్లికి చెందిన పెంటమ్మ తన కుమార్తె కాలుకు గాయమవగా ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించింది. డాక్టర్లు చికిత్స చేసి... కూతురిని డిశ్చార్జ్ చేశారు. కానీ లాక్​డౌన్​ కారణంగా ఇంటికి వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో... దిక్కుతోచని స్థితిలో ఆస్పత్రి ప్రాంగణంలోని చెట్టు కిందే ఉండిపోయారు.

వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసేందుకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి వారిని చూసి... పరిస్థితిని అర్థం చేసుకుని వారికి సాయం చేశారు. వారిని స్వగృహం చేర్చాలంటూ పోలీసులకు ఆదేశించారు. ఖర్చుల నిమిత్తం బాధితులకు ఆర్థిక సాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఇవీ చూడండి:చాపకింద నీరులా కరోనా... ఈ మహమ్మారి ఆగేనా?

ABOUT THE AUTHOR

...view details