నిత్యం తనవెంటే రక్షణగా ఉంటూ.. పహారా కాసే రక్షక భటుల ఆయుధాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయుధ పూజ చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
మంత్రి ఎర్రబెల్లి నివాసంలో ఆయుధపూజ.. - ఎర్రబెల్లి ఆయుధ పూజ తాజా వార్త
విజయదశమి వేడుకలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కుటుంబ సభ్యులతో కలిసి వైభవంగా నిర్వహించుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా పర్వతగిరిలో తన నివాసంలో సతీసమేతంగా కలిసి నిత్యం తనవెంటే ఉంటూ రక్షణ కల్పిస్తున్న రక్షక భటుల ఆయుధాలకు ఆయుధపూజ చేశారు.
![మంత్రి ఎర్రబెల్లి నివాసంలో ఆయుధపూజ.. minister errabelli ayudha puja at parvathagiri in warangal urban district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9310834-603-9310834-1603642006439.jpg)
రక్షక భటుల ఆయుధాలకు మంత్రి ఎర్రబెల్లి ఆయుధపూజ..
ఈ ఆయుధ పూజలో మంత్రి ఎర్రబెల్లి దంపతులతో పాటు వారి తనయుడు ప్రేమ్ చందర్ రావు దంపతులు, మనుమలు, మనుమరాండ్లు, కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు.. కిటకిటలాడిన ఆలయాలు