వరంగల్ తూర్పు నియోజకవర్గ కేంద్రంగా వరంగల్ జిల్లా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేంద్రంగా హన్మకొండ జిల్లాగా మార్పు చేయాలని ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రజల అభీష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి మార్పులకు అనుగుణంగా దీనిని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, జిల్లాకు చెందిన ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లాల మార్పులపై మంత్రి ఎర్రబెల్లి సమావేశం - hanmakonda
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల మార్పు ప్రతిపాదనలపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.

ప్రజాప్రతినిధులతో ఎర్రబెల్లి సమావేశం
Last Updated : Jun 28, 2019, 12:26 PM IST