తెలంగాణ

telangana

ETV Bharat / state

'వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా టీకా' - భీమదేవరపల్లిలో మంత్రి ఈటల

వరంగల్​ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లిలోని శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామిని మంత్రి ఈటల రాజేందర్​ దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు వృక్ష ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 16 నుంచి జిల్లాలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు.

minister eetala rajender, bheema devarapally, warangal urban
మంత్రి ఈటల రాజేందర్​, కొవిడ్​ టీకా, శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయం

By

Published : Jan 13, 2021, 3:48 PM IST

Updated : Jan 13, 2021, 4:22 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామిని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన వృక్ష ప్రసాదాలను మంత్రి పంపిణీ చేశారు. నాలుగేళ్లుగా ఆలయానికి వచ్చే భక్తులకు వివిధ రకాల పండ్ల మొక్కలను వృక్ష ప్రసాదంగా దాత సురేందర్ రెడ్డి అందించడాన్ని ఈటల అభినందించారు. త్వరలో ఆలయం కొండపైకి ఘాట్​ రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

28 రోజుల తర్వాత రెండవ డోసు

ఈ నెల 16 నుంచి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 139 సెంటర్లలో కరోనా సమయంలో ముందుండి సేవలందించిన సిబ్బందికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం మొదలవుతుందని మంత్రి తెలిపారు. 50 ఏళ్లు పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కూడా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు. మొదటి డోసు వేసుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండవ డోసు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 3,64,000 డోసులు వచ్చాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు.

'వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా టీకా'

ఇదీ చదవండి:రైతుల భవిష్యత్తును సీఎం కేసీఆర్​ తాకట్టు పెట్టారు : భట్టి

Last Updated : Jan 13, 2021, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details