వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయి కమిటీ చైర్మన్ జస్టిస్ సీవీ రాములు పరిశీలించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో ఆయన కలియ తిరిగి రోగులకు అందుతున్న సేవలపై ఆస్పత్రి కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను, సిబ్బంది పనితీరుపై మండిపడ్డారు ఆస్పత్రిలో చెత్త పేరుకుపోవడం వల్ల అధికారులను జస్టిస్ మందలించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు ఆదేశించారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని లేనిపక్షంలో శాఖాపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన జస్టిస్ రాములు - ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన జస్టిస్ రాములు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని జస్టిస్ సీవీ రాములు సందర్శించారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై ఆరాతీశారు. సిబ్బంది, అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
![ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన జస్టిస్ రాములు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3569154-thumbnail-3x2-mgm.jpg)
ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన జస్టిస్ రాములు
Last Updated : Jun 15, 2019, 7:31 PM IST