తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనాపై ఆందోళన కన్నా అవగాహన ముఖ్యం' - వరంగల్​ తాజా వార్త

రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలోని ఆసుపత్రుల్లన్నింటినీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం 25 పడకలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును ఎంజీఎం సూపరింటెండెంట్​ శ్రీనివాసరావు పరిశీలించారు. శ్రీనివాస్​తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి..

MGM hospital superintendent visited by special ward set up for corona patients in warangal
'కరోనాపై ఆందోళన కన్నా అవగాహన ముఖ్యం'

By

Published : Mar 4, 2020, 6:14 PM IST

సర్కార్ ఆదేశాలతో మేరకు ఉత్తర తెలంగాణలో పెద్దాసుపత్రైన వరంగల్ ఎంజీఎంలో కరోనా వైరస్ బాధితుల కోసం 25 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పరిశీలించారు.

అన్ని సౌకర్యాలతో వార్డు ఏర్పాటు చేశామని.. 24 గంటలూ సీనియర్ వైద్యుల పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. అనుమానితులకు సంబంధించి శాంపిల్స్ సేకరించి.. హైదరాబాద్​కు పంపిస్తామని... అత్యవసరమైతే వెంటిలేటర్ సదుపాయం కల్పిస్తామని శ్రీనివాస్​ తెలిపారు.

పేషెంట్ తాలూకు.. వివరాలు... ఎక్కడెక్కడ ప్రయాణించిందీ మొదలైనవి సేకరించి... ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆయన తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ ఈ సమాచారం అందించామని చెప్పారు. వైరస్ వ్యాప్తిపై ఆందోళన కన్నా... అవగాహన ముఖ్యమని.. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని తెలిపారు.

'కరోనాపై ఆందోళన కన్నా అవగాహన ముఖ్యం'

ఇవీ చూడండి:'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'

ABOUT THE AUTHOR

...view details