తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రోత్సాహకాలు అందించాలని పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - sanitation labor protest in warangal

జీవో నంబర్ 14 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

mgm hospital sanitation labor demands to implement go number fourteen
వరంగల్​ ఎంజీఎం వద్ద కార్మికుల ఆందోళన

By

Published : Jul 16, 2020, 2:37 PM IST

వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రి వద్ద పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు దిగారు. జీవో నంబర్ 14 అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యులు, నర్సులకు ఏవిధంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నారో.. అదే తరహాలో తమకు బోనస్ చెల్లించాలని కోరారు.

తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగుతామని కార్మిక సంఘం నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details