విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో నిట్ విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారని విద్యాసంస్థ సంచాలకులు రమణ రావు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గతేడాది నిర్వహించిన రక్తదాన శిబిరంలో 1100 మంది విద్యార్థులు రక్తదానం చేయగా.. ఈ సంవత్సరం 1500 మంది రక్త దానం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
'రక్తదాన శిబిరాలతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవచ్చు'
రక్తదాన శిబిరాల ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవచ్చని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పేర్కొన్నారు. నిట్లో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా పాలనాధికారి, సంస్థ సంచాలకులు ప్రారంభించారు.
'రక్తదాన శిబిరాలతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవచ్చు'