వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది.
మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీల లెక్కింపు ప్రారంభం
మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీ లెక్కింపు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో ప్రారంభమైంది. పోలీసుల బందోబస్తు నడుమ హుండీల లెక్కింపు కొనసాగుతోంది.
మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీల లెక్కింపు ప్రారంభం
దేవాదాయ శాఖ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, మేడారం ఆలయ ఈవో రాజేంద్ర హుండీల సీల్ తెరిచి లెక్కింపు ప్రారంభించారు. వారం రోజుల పాటు పోలీసు బందోబస్తు నడుమ, సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం 494 హుండీలను 200 మంది సిబ్బంది లెక్కించనున్నారు.
గత జాతర ఆదాయం రూ. 10 కోట్లు రాగా ఈ ఏడాదీ రూ.10 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
- ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు