Medaram Jatara Development Works Not Started : దేశంలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతరగా మేడారం జాతర(Medaram Jatara Festival 2024) ప్రసిద్ధి చెందింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహా జాతర.. ఆద్యంతం కోలాహలంగా జరుగుతుంది. వనంలో కొలువైన తల్లులు జనంలోకి వచ్చే వేళ.. మేడారం జన సంద్రమవుతుంది. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ వంటి తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. జంపన్నవాగులో స్నానాలను ఆచరించి.. వనదేవతలను దర్శించుకుంటారు. బంగారాన్ని కానుకగా సమర్పించి.. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు.
ప్రతి రెండేళ్లకోసారి ఎంతో వైభవంగా జరిగే మేడారం మహా జాతర(India Biggest Tribal Festival Medaram Jatara) ..వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల 21న ప్రారంభమై.. 24న ముగుస్తుంది. కోటిన్నరకు పైగా భక్తులు జాతరకు తరలివస్తారు. ఇందుకోసం ప్రతిసారి ఆరు నెలల ముందు నుంచే అధికారులు పనులను ప్రారంభిస్తారు. ఈసారి రూ.75 కోట్లతో 21 శాఖల అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి.. సర్కార్ ఆమోదం కోసం పంపినా ఆమోదం కాలేదు. నిధుల విడుదల కాకపోవడంతో జాతర పనులకు మోక్షం కలుగలేదు. నిధుల విడుదలకు ఎలక్షన్ కోడ్ అడ్డంకే అసలు కారణం.
Medaram Jathara: సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసినా తరలివస్తున్న భక్తులు
Medaram Jatara Festival in Telangana :దీంతో జాతర పనులు అన్నీ ఎక్కడివక్కడే అలాగే ఆగిపోయాయి. వరదల కారణంగా గతంలో చేసిన నిర్మాణాలు, రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. వీటిని మరమ్మతు చేస్తూనే.. నీటి ట్యాంకులు, స్నానపు ఘట్టాలు, కల్యాణ కట్టలు, భక్తులకు షెడ్లు, మరుగుదొడ్లు నిర్మించాలి. ఇంకా ఆలయానికి రంగులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి తదితర పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది.