తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండకు చేరుకున్న మేడారం జాతర హుండీలు - మేడారం జాతర విశేషాలు

మేడారం జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను భారీ బందోబస్తు నడుమ అధికారులు హన్మకొండకు తరలించారు. ఈ బుధవారం నుంచి సీసీ కెమెరాల నిఘాలో హుండీలు లెక్కించనున్నారు.

MEDARAM HUNDIS ARE REACHED TO HANMAKONDA TO COUNT
MEDARAM HUNDIS ARE REACHED TO HANMAKONDA TO COUNT

By

Published : Feb 10, 2020, 11:38 PM IST

మేడారం సమ్మక్క-సారక్క జాతర హుండీలు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చేరుకున్నాయి. ఈనెల 4 నుంచి 8 వరకు వైభవోపేతంగా జరిగిన జాతరకు లక్షలాది మంది భక్తులు విచ్చేసి.... అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. దేవాదాయశాఖ అధికారులు ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు ఘనంగా కానుకలు వేశారు.

మేడారంలో మొత్తం 456 హుండీలు ఏర్పాటు చేశారు. జాతర అనంతరం హుండీలను భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక బస్సుల్లో హన్మకొండలోని తితిదే కళ్యాణ మండపానికి తరలించారు. బుధవారం నుంచి సీసీ కెమెరాల మధ్య హుండీల్లోని కానుకలను లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు.

హన్మకొండకు చేరుకున్న మేడారం జాతర హుండీలు

ఇదీ చూడండి:వేడుకలో పరిచయం.. వంచించి సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details